Leopard Captured Trap Camera Visuals: చిరుత అసలు బోనుకు ఎలా చిక్కిందో క్లియర్ గా తెలిపే వీడియో

తిరుమల నడకమార్గంలో ఆపరేషన్ చిరుత చేపట్టిన అధికారులు... ఇవాళ తెల్లవారుజాము నాలుగో చిరుతను పట్టుకున్నారు. బోనులో చిక్కేముందు చిరుత చాలా జాగ్రత్తగా వ్యవహరించిందని ఇప్పుడు బయటకొచ్చిన ట్రాప్ కెమెరాల విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. అసలు నిన్నటికన్నా ముందే... ఆగస్ట్ 24వ తేదీన రాత్రి 11 గంటల 15 నిమిషాల నుంచి 11 గంటల 45 నిమిషాల దాకా సుమారు అరగంట పాటు ఆ బోను చుట్టూనే చిరుత తిరిగింది. బోనులో ఎరగా ఉంచిన కుక్కను తినాలని ప్రయత్నించినా... ఎందుకో వెనుకాడి అక్కడ్నుంచి వెళ్లిపోయింది. మరోసారి ఇవాళ తెల్లవారుజామున మూడున్నర గంటలకు అదే ప్రదేశానికి చేరుకుంది. ఈసారి ఉదయం 5 గంటల 55 నిమిషాల దాకా అంటే దాదాపు రెండున్నర గంటలు అక్కడే తిరిగింది. ఇక ఆఖరికి ఆకలికి ఆగలేక బోనులోకి అడుగుపెట్టింది. వెంటనే తలుపులు మూసుకుపోయి చిరుత చిక్కింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola