సరైన సదుపాయాలు లేక కాణిపాకంలో భక్తుల ఇబ్బందులు
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.ఉదయం నుంచి స్వామి వారి దర్శనార్థం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు కాణిపాకంకు చేరుకున్నారు. విజ్ఞాలు తొలగించే విగ్నేశ్వరుడి దర్శనార్థం కాణిపాకం వస్తే ఆలయ అధికారుల అలసత్వ పోకడతో భక్తులకు నిరాశే ఎదురవుతోంది. సరైన క్యూలైన్ మేనేజ్మెంట్ లేక విఐపి సేవలో నిమగ్నమైన అధికారులు సామాన్య భక్తుల అవసరాలను మరిచారు.