సీఎం జగన్ ను కలసి వేదాశీర్వాదం అందించిన దేవాదాయ శాఖ
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సీఎం జగన్ కు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.వెంకటేశ్వర స్వామి శేషవస్త్రం, ప్రసాదాలను, టీటీడీ క్యాలెండర్, డైరీలను టీటీడీ అర్చకులు సీఎం కు అందించారు.దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.