Central Team Darshan: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం సభ్యులు
తిరుమల శ్రీవారిని ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో కమిటీ సభ్యులు కునాల్ సత్యార్థి., అభేయ్ కుమార్., డాక్టర్ కె మనోహరణ్., శ్రీనివాసు బైరి., శివాని శర్మ., శ్రవణ్ కుమార్ సింగ్., అనిల్ కుమార్ సింగ్ లు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు కమిటీ సభ్యులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా...ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.