Ananthapur Central University: బస్టాండ్ లో బాత్రూములు ఇంకా నీట్ గా ఉంటాయి..ఇదేం దారుణం

అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సీటీ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. వేలకు వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నా...కనీస మౌలిక వసతులు సైతం విశ్వవిద్యాలయంలో లేవంటూ ధర్నాకు దిగారు. వసతి గృహాల పరిస్థితి మరింత ఘోరంగా ఉందన్న విద్యార్థులు...రాత్రి నుంచి వసతి గదులకు వెళ్లకుండా ఆరుబయటే ఉంటూ ఆందోళన చేస్తున్నారు. విభజన హామీల్లో భాగంగా ఏర్పాటైన విశ్వవిద్యాలయం నేటికీ తాత్కాలిక భవనాల్లో నడుస్తుంటే....కనీసం మౌలిక వసతులు లేకుండా తమను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola