దేవాదాయశాఖ నడుపుతున్న ఏకైక కళాశాల మూసివేత..!
శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీకాళహస్తీశ్వర ఇంజనీరింగ్ కళాశాల మరియు డిప్లమా కాలేజ్ ను మూసివేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. కళాశాలలో ఉద్యోగ సిబ్బందిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగం నుంచి తొలగిస్తే ఎలా బతకాలి అంటూ ఉద్యోగ సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పడుతున్నారు..