Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు సీజే జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి
తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో అరూప్ గోస్వామి దంపతులు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.