అలిపిరి వద్ద కొబ్బరి కాయలు కొట్టి పాదయాత్రను ముగించనున్న అమరావతి రైతులు
అమరావతి రైతుల పాదయాత్ర నేటితో ముగియనుంది. తిరుపతికి చేరుకున్న మహా పాదయాత్ర అలిపిరి చేరుకోవడం తో సమాప్తం కానుంది. అలిపిరి వద్ద కొబ్బరి కాయలు కొట్టి పాదయాత్రను ముగించనున్నారు అమరావతి రైతులు. ఇప్పటికే అన్ని ప్రతిపక్ష పార్టీలు అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపాయి. తిరుపతిలోని రామానాయుడు కల్యాణ మండపం నుంచి ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం మీదుగా రైల్వేస్టేషన్, కర్నాల వీధి, కృష్ణాపురం ఠాణా, ఎన్టీఆర్ విగ్రహం, రామచంద్ర పుష్కరిణి వద్దకు రైతుల మహా పాదయాత్ర సాగుతుంది. భోజనానంతరం రాములవారి గుడి, చిన్న బజారు వీధి, గాంధీరోడ్డు, నాలుగు కాళ్ల మండపం, నగరపాలక సంస్థ, తితిదే పరిపాలన భవనం, అన్నారావు సర్కిల్, హరేరామ హరే కృష్ణ గుడి, రుయా ఆస్పత్రి మీదుగా అలిపిరి పాదాల మండపం ముగియనుంది.