Tirumala Ghee Adulteration Case | తిరుమల లడ్డూ కల్తీ కేసులో నలుగురు అరెస్ట్ | ABP Desam
తిరుమల లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు కలిసిందన్న అభియోగాలపై సుప్రీంకోర్టు వేసిన సిట్ విచారణ కొనసాగిస్తుండగా తొలిసారిగా ఈ కేసులో నలుగురి అధికారులు అరెస్ట్ చేశారు. తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్న డెయిరీలపై ఎంక్వైరీ చేసిన సిట్ అధికారులు ఉత్తరఖండ్ లోని రూర్కీకి చెందిన భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉన్న శ్రీవైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ చావడా...చెన్నై దిండిగల్ సమీపంలోని ఏఆర్ డెయిరీ ఎండీ రాజూ రాజశేఖర్ లను సిట్ అధికారులు అరెస్ట్ చేసి తిరుపతికి తీసుకువచ్చారు. రాత్రి న్యాయమూర్తి నివాసంలో నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కాగా న్యాయమూర్తి 20రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. శ్రీకాళహస్తిలోని శ్రీవైష్ణవి డెయిరీ ఉత్తరాఖండ్ లోని భోలేబాబా డెయిరీ నుంచి కిలోనెయ్యి ని 355రూపాయలకు కొనుగోలు చేసి..దాన్ని చెన్నైలోని ఏఆర్ డెయిరీకి 319రూపాయలకే సరఫరా చేసినట్లు అధికారు విచారణలో తేలింది. మార్కెట్లో కిలీ నెయ్యి కనిష్ఠంగా 500 ఉన్నప్పుడు 320లకే టీటీడీ కి శ్రీవైష్ణవి డెయిరీ ఎలా సరఫరా చేసిందనే కోణంలో అధికారులు విచారణ సాగిస్తున్నారు. వేరే రాష్ట్రాల నుంచి నెయ్యిని కొని అంతకంటే తక్కువ రేటుకు టీటీడీకి అమ్ముతున్నారంటే కచ్చితంగా కల్తీ చేసే అవకాశాలున్నాయన్న కోణంలో సిట్ అధికారులు పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు.