Kiran Royal Janasena Issue | వివాదంలో చిక్కుకున్న తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ | ABP Desam
తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ చుట్టూ వివాదం నెలకొంది. తిరుపతికి చెందిన లక్ష్మీ అనే మహిళ తన దగ్గర కిరణ్ రాయల్ 20లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ ఓ వీడియోను విడుదల చేశారు. తనకు చావటం తప్ప మరో మార్గం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోణలపై కిరణ్ రాయల్ సైతం రియాక్ట్ అయ్యారు. జగన్ తన 2.0 చూస్తారు అన్నందుకు తనో ప్రెస్ మీట్ పెట్టానని..అందుకో జగన్ ను చిట్టి రోబోలా చిట్టిరెడ్డి 2.0 అని పోస్టర్లు రిలీజ్ చేశానని గుర్తు చేశారు.జగన్ ను అలా ట్రోల్ చేసినందుకు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి...లక్ష్మీ అనే మహిళతో ఇలా వీడియోలు రిలీజ్ చేయించాడని కిరణ్ రాయల్ ఆరోపిస్తున్నారు. ఆ మహిళలపై జైపూర్, విశాఖపట్నం, బెంగుళూరు సహా అనేక ప్రాంతాల్లో బెట్టింగ్, చిట్ ఫండ్ కేసులున్నాయన్న కిరణ్ రాయల్...ఆమె ఫ్రాడ్ అంటూ తన దగ్గరున్న ఆధారాలను బయట పెట్టారు.