
Baduguvani Lanka Nurseries | గోదావరి తీరంలో ఈ ఊరి పూలతోటల అందాలు చూశారా | ABP Desam
గోదావరితీరానికి ఆనుకుని ఉన్న ఆలంక గ్రామంలో ఊరంతా రైతులు పూల సాగుపైనే ఆధరాపడి జీవిస్తుంటారు.. సారవంతమైన నేలలో ఉద్యానవనంలా కనిపించే ఆ గ్రామంలో పూల చేలను చూడడానికి రెండు కళ్లూ చాలవు.. సుమారు 800 ఎకరాల విస్తీర్ణంకు పైబడి ఉన్న ఈలంక పొలాల్లో ఎక్కడ చూసినా రంగురంగుల పూల వనాలే కనిపిస్తాయి.. ఊరంతా ఈ పూల సాగునే చేయడంతోపాటు కొంత విస్తీర్ణంలో కాయగూరలు పండిరచడం కనిపిస్తుంది.. చేతికందిన పూల పంటను ఎప్పటికప్పుడు కోసి గంపల్లో కూర్చి వాటిని దగ్గర్లోనే ఉన్న కడియపులంక పూలమార్కెట్‌లో విక్రయిస్తుంటారు.. నష్టమొచ్చినా సరే ఈపూలసాగు అంటేనే మక్కువ మాకు అంటుంటారు ఇక్కడి రైతులు.. చామంతిలోను ఆరు రకాలకు పైబడి రకాల మొక్కల సాగుతో ఇక్కడి రైతులు పూలను పూయిస్తున్నారు.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలోకి వచ్చే బడుగువాని లంక అనే ఈ గ్రామంలో సుమారు 2000 మంది రైతులు ఈ పూలసాగును చేస్తున్నారు.. ఈ రంగుల పూల వనాలకు కలిగిన బడుగువాని లంక నుంచి ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్..