నోటీసులు ఇవ్వకుండా తొలగించడం సరికాదన్న టీడీపీ నేతలు | ABP Desam
అధికారులు ఆక్రమణల పేరిట చిరువ్యాపారులను తొలగించడాన్ని తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వహణకార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అడ్డుకున్నారు.ఎటువంటినోటీసులు ఇవ్వకుండా తొలగించడం సరి కాదన్నారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.కడపజిల్లా మైదుకూరు మండలం వనిపెంట గ్రామం మిట్టమానుపల్లె రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలను ఆర్అడ్ బి శాఖ ఏఈ రజియా,పోలీసులసహాయంతోసిబ్బందితో ఆక్రమణలని తొలగించే ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న రెడ్యం వెంకటసుబ్బారెడ్డి,తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,నేతలతోకలిసి వనిపెంట చేరుకున్నారు. తొలగింపును నిలిపివేయాలని,నోటీసులు ఇవ్వకుండా తొలగిస్తే చిరువ్యాపారులు ఎలాబతుకుతారని నిలదీశారు.