MLA Buchaiah Chowdary: జగనన్న కాలనీల్లో అవినీతిపై సీబీఐ విచారణ జరగాలి: ఎమ్మెల్యే డిమాండ్
జగనన్న కాలనీ నిర్మాణాల్లో తీవ్ర అవినీతి జరిగిందని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు. పునాదులు తవ్వి ఇవ్వండని పేదలు కోరితే ఏకంగా లోయలు తవ్వేసి ఇచ్చారని... తూర్పుగోదావరి జిల్లాలో ఈ పథకం అబాసుపాలవుతోందని బుచ్చయ్య విమర్శించారు. ఎంపీ మార్గాని భరత్ సూచనలతోనే అవినీతి జరిగినట్లుగా తెలుస్తోందని ఆరోపించారు. ఈ అవినీతిపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
Tags :
ANDHRA PRADESH YSRCP Tdp Jagananna Colonies Mla Gorantla Butchaiah Chowdary Gorantla Buchaiah Chowdary On Jagananna Colonies