MLA Adireddy Vasu Press Meet | రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రెస్‌‌మీట్ | ABP Desam

దేవుడు రాసిన స్క్రిప్ట్ ను ఎవరు మార్చలేరని రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ మారడం వలన మోరంపూడి ఫ్లై ఓవర్ పూర్తి కాలేదని తెలిపారు. తప్పుడు సంస్కృతికి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. గడచిన ఐదు సంవత్సరాలుగా రాజమండ్రి ప్రజలను మాజీ ఎంపీ భరత్ మోసం చేశాడని ఆరోపించారు. ఎన్డీఏ కూటమి హయాంలోనే నిర్మాణం పూర్తి అవుతుందని హామీ ఇచ్చారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడకుండా ఉండి ఉంటే నిర్మాణం పూర్తి అయ్యేదన్నారు. ఈ ప్రాజెక్టుకు భరత్ గుమస్తాగా పనిచేశాడని తెలిపారు. వాతావరణ సహకరిస్తే మూడు నెలల్లోపు పూర్తి చేస్తానని పేర్కొన్నారు. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి భరత్ ను ఆహ్వానిస్తామన్నారు. రాజమండ్రికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. నిర్మాణం లో జాప్యం వల్ల వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆవేదన వ్యక్తం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola