Pawan kalyan About PM Modi | ఎన్డీయే పక్షనేతగా మోదీ..సంపూర్ణ మద్దతు ప్రకటించిన జనసేనాని | ABP

Pawan kalyan About PM Modi | మోదీ సలహాతోనే ఏపీలో ఎన్డీయే అఖండ విజయం సాధించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఢిల్లీలోని ఎన్డీయే 3.0 కూటమి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మోదీ నాయకత్వానికి జనసేన మద్దతిస్తుందని స్పష్టం చేశారు. 'జనసేన తరఫున మోదీకి హృదయపూర్వక శుభాకాంక్షలు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఆయన స్ఫూర్తిగా నిలిచారు. మోదీ భారతదేశానికి ప్రధానిగా ఉన్నంత వరకూ ఏ దేశానికీ తలొగ్గే పరిస్థితి రాదు. మోదీ నేతృత్వంలో పని చేయడాన్ని గర్వంగా భావిస్తున్నాం.' అని పవన్ పేర్కొన్నారు. కాగా, ఈ భేటీకి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ సహా 240 మంది బీజేపీ ఎంపీలతో పాటు టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్‌జనశక్తి (రాంవిలాస్), ఎన్‌సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదళ్ సహా ఇతర మిత్రపక్షాల ఎంపీలు, ఎన్డీయే పార్టీల మంత్రులు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. మోదీ సలహాతోనే ఏపీలో ఎన్డీయే అఖండ విజయం సాధించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola