Ananthpur SSBN: ప్రభుత్వ నిర్ణయాలతో విద్యార్థులు పడే కష్టాలు నారా లోకేష్ కి వివరించామన్న పరిటాల శ్రీరామ్
అనంతపురం ఎస్ఎస్ బీఎన్ కళాశాలలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన ముగిసింది. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన లోకేష్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్....ఎట్టిపరిస్థితుల్లోనూ ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలను రద్దు కానివ్వమన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా పేదవిద్యార్థులు ఎంత ఇబ్బందులో పడుతున్నారో నారా లోకేష్ అడిగి తెలుసుకున్నారని చెబుతున్న పరిటాల శ్రీరామ్ తో ఏబీపీ దేశం ముఖాముఖి.
Tags :
Nara Lokesh AIDED COLLEGES Paritala Sriram Ananthpur SSBN College Students Protest In SSBN College