TDP Excellent Comeback After 2019 Colossal Loss | 2019 ఓటమి తర్వాత టీడీపీ కమ్‌బ్యాక్
జైలర్ సినిమా థీమ్ చూస్తే.. రజనీకాంత్... తన ప్రత్యర్థిని ఎదుర్కొవడానికి ఇద్దరు స్నేహితులను వాడుకుంటాడు. కన్నడ, మలయాళ సూపర్ స్టార్ట్స్ శివరాజ్ కుమార్, మోహనలాల్ ఓ రోల్స్ చేశారు. రజనీకి అవసరం వచ్చినప్పుడల్లా వాళ్ల ఎంట్రీ ఉంటుంది. రజనీ స్వతహాగా కెపాసిటీ రజనీకాంత్ ది చంద్రబాబుది ఇంచు మించు ఒకే వయసు.. ఒకే పర్సనాలిటీ.. ఇద్దరికీ హిట్ కొట్టి చాన్నాళ్లైంది. జైలర్ తో రజీనీ ఫామ్ లోకి వస్తే.. ఎలక్షన్ తో చంద్రబాబు సీన్ లోకి వచ్చేశాడు. ఆ సినిమా సిల్వర్ స్క్రీన్‌పై హిట్ అయితే ఈ సినిమా పొలిటికల్ తెరపై బ్లాక్ బస్టర్ అయింది......
జింకను వేటాడటానికి పులి ఎంత ఓపికగా ఉంటాదో చూశావా అనే డైలాగ్ ఉంటుంది కదా..అట్టాంటిది పులినే వేటాడాలి అంటే.. ఎందుకంటే వైసీపీ వాళ్లు జగన్ మోహనరెడ్డి పులివెందుల పులి అంటారు. ఆ పులి 2019లో కొట్టిన దెబ్బకు.. తెలుగుదేశం పని అయిపోయిందనుకున్నారు. వయసు మీద పడుతున్న చంద్రబాబు మళ్లీ లేవడన్నారు. మంగళగిరిలో ఓడిపోవడంతో కొడుకు పనీ అంతే అన్నారు. కానీ వీళ్లకి తెలియందేంటంటే.. ఇవతల దెబ్బతింది కూడా ఇలాంటి డెక్కా మొక్కీలు ఎన్నో తిన్న పులే. 2004లో వైఎస్సార్ లీడ్ చేసిన కాంగ్రెస్‌లో పరాభవం తర్వాత.. చంద్రబాబు పని అయిపోయిందనుకోలేదు. తిరిగి 2009లో లేస్తాడు అనుకున్నారు. కానీ అప్పుడు ప్రజారాజ్యం రూపంలో అడ్డంకి వచ్చింది. ఇక కష్టమే అనుకన్నాక మళ్లీ లేచాడు. 2014లో పార్టీని నిలబెట్టి.. తానూ నిలబడ్డాడు. ఓ పదేళ్ల పాటు అధికారంలో లేకపోతే రాజకీయ పార్టీల మనుగడ కష్టమన్నారు. అప్పటికే తనతో సాగుతున్న సీనియర్లు.. బయటకెళ్లారు. కొత్త వాళ్లొచ్చారు. రాజకీయాలు మారిపోయాయి. అప్పుడు కూడా కూటమి కట్టి నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా సంతకం చేశారు. అమరావతే అజెండా అంటూ దూసుకుపోతున్న తరుణంలో అతివిశ్వాసానికి పోయి.. తప్పులు చేశారు. జగన్ కావాలన్న కోరిక.. చంద్రబాబు తప్పులు, పవన్ కల్యాణ్ వెళ్లిపోవడం అన్నీ కలిసి 2019లో ఘోరమైన ఓటమి. ఇక ఈసారి చంద్రబాబు పని అంతే అన్నారు. జగన్ ను తట్టుకోవడం తన వల్ల కాదన్నారు. నిజంగా ఎన్నికలకు ఏడాది ముందు వరకూ పరిస్థితి అదే... కానీ... ఆయన అల్లాటప్పా బాబు కాదు.. చంద్రబాబు. చివరి నిమిషంలోనూ శక్తి మేర పోరాడేవాడు. అలాగే చేశాడు.