TDP Ex MLA Prabhakar Chowdary | అనంతపురం అర్బన్ టికెట్ దక్కకపోవటంపై ప్రభాకర్ చౌదరి ఆగ్రహం| ABP Desam
Continues below advertisement
అనంతపురం అర్బన్ టికెట్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి కేటాయించకపోవడంపై అనంతపురం జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టికెట్టు తనకి కాదని ఓ వ్యాపారవేత్తకు ఇవ్వటం తీవ్ర అసంతృప్తికి లోనయ్యానని ప్రభాకర్ చౌదరి ఏబీపీ దేశంతో మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్తుపై రేపు ఓ ప్రకటన చేస్తానన్నారు. కానీ ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు, ప్రభాకర్ చౌదరి అభిమానులు అనంతపురం అర్బన్ లో పలు హింసాత్మక ఘటనలకు దిగారు.
Continues below advertisement