TDP DEEKSHA: చంద్రబాబు 36గంటల నిరసనదీక్షకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. 36గంటల పాటు చంద్రబాబు చేపట్టిన దీక్షకు మద్దతు పలికేందుకు వచ్చిన కార్యకర్తలు, నాయకులతో మంగళగిరి పార్టీ కార్యాలయం కిక్కిరిసిపోయింది. వచ్చిన నాయకులను పలకరిస్తూ నారా లోకేష్ కార్యకర్తలకు అభయమిచ్చారు. ఓపిక, సహనంతో వేచి ఉందామని న్యాయమే గెలుస్తుందని చంద్రబాబు, లోకేష్ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.