TDP Dalitha Garjana : టీడీపీ ఎస్సీ సెల్ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు | ABP Desam
విజయవాడలో టీడీపీ నిర్వహించాలనుకున్న దళిత గర్జన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్న కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగారు.