
TDP Activist Loss life in Punganur | పెద్దిరెడ్డి ఇలాకాలో బలైపోయిన మరో టీడీపీ కార్యకర్త | ABP Desam
పెద్ది రెడ్డి ఇలాకాలో మరో టీడీపీ కార్యకర్త బలైపోయాడు. తనను చంపేస్తారంటూ పదిహేను రోజుల క్రితమే వీడియోలు పెట్టినా... పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు లేకపోవటంతో టీడీపీ కార్యకర్త కాగితి రామకృష్ణనాయుడు ప్రాణాలు కోల్పోయారు. ఆయన్ను ప్రత్యర్థి వైసీపీ పార్టీకి చెందిన నాయకులు వేటకొడవళ్లతో నరికి చంపారు. శనివారం ఉదయం పొలం పనుల కోసం తన కొడుకుతో కలిసి వెళ్లిన రామకృష్ణ నాయుడును దారి కాచి హతమార్చారు. ఈ ఘటనలో రామకృష్ణనాయుడు కుమారుడు సురేశ్ కుమార్ కు గాయాలయ్యాయి. తృటిలో సురేశ్ కుమార్ ప్రాణాలు దక్కించుకున్నాడు..రామకృష్ణ నాయుడుని చంపిన వ్యక్తులైన వెంకటరమణ, గణపతి, త్రిలోక్, మహేశ్ టీడీపీ గెలిచిన రోజు నుంచి రామకృష్ణ నాయుడుని ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో గెలిచినా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించటంతో కేక్ కట్ చేసి సంబరాలను చేసిన తనను టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని పదిహేను రోజుల క్రితం రామకృష్ణ నాయుడు ఈ వీడియోను విడుదల చేశారు.పోలీసులు పట్టించుకోకపోగా...తనకు ఎలాంటి రక్షణ కల్పించకపోవటంతో రామకృష్ణనాయుడు ప్రాణాలే కోల్పోయారు. పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ రామకృష్ణ మృతదేహం ఉంచిన ఆసుపత్రి ఎదుటే ఆయన భార్య, మరో కుమారుడు, బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. పుంగనూరు టీడీపీ ఇన్ ఛార్జి చల్లా బాబు, పలమనేరు ఎమ్మెల్యే మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకువెళ్లి నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని చల్లా బాబు హామీ, అమర్ నాథ్ రెడ్డి ఇచ్చారు.నిందితులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులుని..అందుకే పోలీసులు భయపడతున్నారని..కూటమి ప్రభుత్వం వచ్చినా టీడీపీ కార్యకర్తలపై దాడులు ఆగకపోతే ప్రాణాలు పోతుంటే ఇంక ఎవ్వరికి తమ బాధలు చెప్పుకోవాలని వాపోతున్నారు రామకృష్ణనాయుడు కుటుంబసభ్యులు.