Drunk man travels beneath RTC bus | పీకల దాకా తాగి..బస్సు కింద వేలాడుతూ జర్నీ చేసిన తాగుబోతు | ABP Desam

 సత్యసాయి జిల్లాలో ఓ తాగుబోతు వింత ప్రయాణం చర్చనీయాంశంగా మారింది. బాగా మందు కొట్టిన ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు కింద దూరి స్టెప్నీ టైర్ మీద ఎక్కి పడుకున్నాడు. కొత్త చెరువు నుంచి హిందూపురం వెళ్లే మార్గంలో జరిగింది ఈ ఘటన. దాదాపు 15కిలోమీటర్ల పాటు బస్సు కింద ఉండి అలాగే ప్రయాణం చేశాడు. బస్ స్టాప్ లో ఆగినప్పుడు ఎక్కే ప్రయాణికులు కొంతమంది టైర్ కింద ఏదో కదులుతున్నట్లు ఉందని చూస్తే ఇదిగో ఈ మనిషి ఇలా తిప్పలు పడుతూ బయటకు వచ్చాడు. ఇకంతే కండక్టర్ డైరెక్టర్ కి గుండె ఆగినంత పనైంది. డబ్బులు లేవంటే ఎక్కించుకుని ఎక్కడో చోట దింపేవాళ్లు ఇదేం రిస్కీ స్టంట్ రా బాబు నీకు ఏమైనా అయ్యింటే ఎవడిది రెస్పాన్స్ బులిటీ అంటూ నానా తిట్లు తిట్టారు సదరు తాగుబోతును. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏం బ్రాండ్ తాగావయ్యా అంటూ ట్రోల్ చేస్తున్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola