Ananthapur Central University: మౌలిక వసతులు కల్పించటంలేదని విద్యార్థుల ఆందోళన

Continues below advertisement

ఫీజులు కడుతున్నా మౌలిక వసతులు కల్పించడం లేదంటూ అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వీసీని బయటకు రానీయకుండా ముఖ ద్వారం వద్ద విద్యార్థులు బైఠాయించి అడ్డుకొని నినాదాలు చేశారు. వేలకు వేలు ఫీజులు కడుతున్నా శిథిలావస్థకు చేరిన వసతిగృహాన్ని ఇచ్చారని ఆరోపించారు. విద్యార్థినులు ఉన్న వసతి గృహంలో పెచ్చులూడి పడుతున్నాయని, ప్రమాదం పొంచి ఉందని విద్యార్థులు చెప్పారు. గదులు సైతం అపరిశుభ్రంగా ఉన్నాయని, రుచికరమైన భోజన సదుపాయం కల్పించడం లేదన్నారు. వసతి గృహానికి యూనివర్సిటీకి ఒక్కో విద్యార్థికి రోజుకు 100 రూపాయలు ఆటో ఖర్చు వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ కి ఉండాల్సిన మెరుగైన వసతులు ఒక్కటి కూడా లేవని వాపోయారు. డిమాండ్ల సాధన కోసం నిరసన చేస్తుంటే యూనివర్సిటీ క్యాంపస్ లోకి పోలీసులు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. తాము ఏమైనా టెర్రరిస్టులమా అంటూ పోలీసులను నిలదీశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram