Srikalahasti: కానిస్టేబుల్ వేధింపులే వాలంటీర్ ప్రాణాలు తీసాయా..!?
చిత్తూరు జిల్లా..శ్రీకాళహస్తిలోని ఎస్.డి.కే.నగర్ లో 9వ వార్డు వాలంటరీ పని చేస్తున్న ఉమా మహేశ్వరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.శ్రీకాళహస్తి పట్టణంలో విధులు నిర్వహించే ఓ కానిస్టేబుల్ కారణంగానే తన కుమార్తే ఆత్మహత్య చేసుకుందని,తన కూతుర్ని మానసికంగా వేధించడంతో ఆ బాధలు తాళలేక గత రాత్రి ఇంటికి వచ్చిన తమ కుమార్తె తీవ్ర మనస్తాపం చేంది ఇంటిలో ఉరేసుకుని మృతి చేందిందని ఆవేదన వ్యక్తం చేసింది.