Srikakulam : తమ గ్రామంలో చెత్త వేయొద్దని టిడి పారాపురం వాసుల ఆందోళన
Continues below advertisement
శ్రీకాకుళం జిల్లా, పాలకొండ మండలం టిడి పారాపురంలో ఉద్రిక్తత నెలకొంది. నగర పంచాయతీకి సంబంధించిన చెత్తను టిడి పారాపురం గ్రామ శివారులో డంప్ చేసేందుకు సిబ్బంది వెళ్లారు. తమ గ్రామ సమీపంలో చెత్తను డంప్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు గ్రామస్థులు. చెత్త తరలించే వాహనాలకు అడ్డంగా బైఠాయించి నిరసన తెలిపారు. నగర పంచాయతీ కమీషనర్, సిబ్బందిని అడ్డుకున్నారు.
Continues below advertisement