మోపాడు రిజర్వాయర్ ను సందర్శించిన సబ్ కలెక్టర్
ప్రకాశం జిల్లా, పామూరు మండలం మోపాడు ప్రాజెక్ట్ రిజర్వాయర్ పూర్తి నిండుగా వుంది. చెరువు లో వరద నీరెక్కువగా వచ్చి పూర్తిగా నిండిపోయిందని, దీంతో నీళ్ల లీకేజీలు వస్తున్నాయని గ్రామస్థులు అంటున్నారు. ప్రమాదకర స్థితిలో ఉన్న మోపాడు రిజర్వాయర్ ను ప్రకాశం జిల్లా సబ్ కలెక్టర్ అపరాజిత సింగ్ సందర్శించారు. డీఎస్పీ కండే శ్రీనివాసరావు, ఇతర అధికారులు కూడా అక్కడికి వచ్చి బాధితులను పరామర్శించారు. వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు. రిజర్వాయర్ వద్ద రక్షణ చర్యలు చేపట్టారు.