శ్రీకాకుళం జిల్లాలో ఒమెక్రాన్ వేరియంట్ సోకిందంటూ వార్తలు
Continues below advertisement
ఒమిక్రాన్ వేరియంట్ పుకార్లు శ్రీకాకుళం జిల్లాలో ప్రజలను భయాందోళనకి గురిచేస్తున్నాయి. దేశంలో రోజుకో ప్రాంతంలో ఈ వేరియంట్ వెలుగుచూస్తున్న తరుణంలో శ్రీకాకుళం జిల్లాలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిందనే వార్తలు ఆందోళన రేపుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఉమ్మిలాడ గ్రామానికి చేరుకున్న ఓ వ్యక్తికి పరీక్ష చేయగా ఆయనకి పాజిటివ్ వచ్చింది. అయితే సాధారణ కరోనానా పాజిటివ్ లేదా ఒమిక్రాన్ వేరియంట్ అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. దీంతో అప్రమత్తమైన అధికారులు, వైద్య సిబ్బంది కోవిడ్ నిర్ధారణ అయిన వ్యక్తిని ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరీక్షా ఫలితాలు వస్తే తప్ప ఒమిక్రానా లేదా అన్నది నిర్ధారించలేమంటున్న శ్రీకాకుళం జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్ జగన్నాధ రావు తో మా ప్రతినిధి ఆనంద్ ఫేస్ టూ ఫేస్.
Continues below advertisement