Srikakulam Collector on Cyclone Jawad :అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి ఉంచామన్నారు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు వేటకి వెళ్ళరాదన్నారు. 90 శాతానికి పైగా వరి కోతలు కోశారు కనుక తెరపలతో జాగ్రత్త వహించాలని, ఇప్పటికే ఎన్ డి ఆర్ ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది కూడా సిద్ధం చేశామని 24 గంటల పాటు కలెక్టర్ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం అన్నారు. ప్రజలకు ఎటువంటి అత్యవసరం సమయంలోనైనా కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి సమాచారం అందించవచ్చు అని, 08942240557.. వాతావరణ శాఖ సూచనల మేరకు అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి ఉంచామన్నారు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola