Watch: శ్రీకాకుళం చిన్నదానికి సింగపూర్ కిరీటం.. నెక్ట్స్ ఎక్కడికి వెళ్తుందో తెలుసా?
మిస్ యూనివర్స్ సింగపూర్ 2021 కిరీటాన్ని తెలుగమ్మాయి నందిత బన్న దక్కించుకుంది. 25 ఏళ్ల క్రితం నందిత కుటుంబం సింగపూర్‌లో స్థిరపడింది. నందిత తల్లిదండ్రులు గోవర్థన్, మాధురి. వారి స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా. శుక్రవారం.. నేషనల్ మ్యూజియం సింగపూర్‌లో మిస్ యూనివర్స్ సింగపూర్ 2021 పోటీలు జరిగాయి. ఈ పోటిలో నందిత బన్న ఏడుగురు ఫైనలిస్టులతో పోటీ పడి టైటిల్‌ను కైవసం చేసుకుంది.