Srikakulam | పక్కనే నది.. తాగేందుకు గుక్కెడు నీళ్లు కరవు | DNN | ABP Desam
అంతరిక్షంలో అడుగుపెట్టిన ఆధునిక యుగంలో పల్లె గ్రామాలకు కష్టాలు తప్పడం లేదు. విద్యా, వైద్యం, ఆరోగ్యం మాట ఎలాగున్నా త్రాగునీటి కోసం కూడా కిలోమీటర్ల దూరం నడిచివెళ్ళాల్సిన పరిస్థితి. పల్లె అభివృద్దికి వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నామని చెప్తున్న ప్రభుత్వాలు అదే గ్రామాలకు కనీసం త్రాగునీటి సౌకర్యం కల్పించలేకపోతున్నారు. దీనితో కుండ నీరు కోసం మండుటెండలో కిలోమీటర్ల దూరం పరుగులెట్టాల్సిన పరిస్థితి దాపురించింది. దీనికి శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి.