SI Rangadu Attack In Chilamatturu: కంప్లయింట్ ఇద్దామని వచ్చినవారిపై దాడి | ABP Desam

తన తల్లికి రావాల్సిన పింఛన్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించిన వేణు అనే వ్యక్తిపై YCP Leader DamodaraReddy దాడి చేశారు. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వేణు వెళ్లగా... అక్కడున్న ఎస్సై రంగడు కూడా తనపై దాడికి దిగాడు. పోలీస్ స్టేషన్ లోకి ఎందుకు వచ్చారంటూ అసభ్యపదజాలంతో వాళ్లను దూషించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఘటనపై జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ స్పందించారు. ఎస్సైపై విచారణకు ఆదేశాలు జారీ చేస్తూ పెనుకొండ డీఎస్పీ ఎన్ రమ్యను విచారణాధికారిగా నియమించారు. పూర్తిగా విచారించాక ఎస్సైపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola