Shiv Sena (UBT) Adithya Thackeray Warns | చంద్రబాబు అప్రమత్తంగా ఉండాలన్న ఆదిత్య ఠాక్రే | ABP Desam

శివసేన (Uddhav Balasaheb Thackeray) పార్టీ నేత ఆదిత్య ఠాక్రే ఏపీ సీఎం  చంద్రబాబు నాయుడును హెచ్చరించారు. బీజేపీని నమ్మితే ఏం జరుగుతుందో ముందు ముందు తెలుస్తుందంటూ మాట్లాడారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ లోపభూయిష్టంగా మారిపోయిందని, ఓట్ల జాబితాల నుంచి ఓటింగ్ మెషిన్ల వరకూ అన్నీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆదిత్య ఠాక్రే...ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ను కలిసి ఇదే అంశంపై మాట్లాడారు. మహారాష్ట్రలో బీజేపీ సర్కారు తమ ప్రభుత్వాన్ని గద్దె దించిన విధానాన్ని ఉదహరించిన ఆదిత్య ఠాక్రే... NDA  భాగస్వామ్యపక్షనేతలైన TDP అధ్యక్షుడు చంద్రబాబు,  JDU నేత నితీష్ కుమార్‌ లను ఉద్దేశించి ఫ్యూచర్ లో మీకు ఇలా జరగొచ్చని.. మీరు జాగ్రత్తగా ఉండాలంటూ కామెంట్స్ చేశారు.దేశ భవిష్యత్ ప్రమాదంలో ఉంది. అసలు ఈ దేశంలో ఎన్నికల నిస్పక్షపాతంగా జరుగుతున్నాయా.. అన్న సందేహం ఉంది. ఇతర రాజకీయ పార్టీలకు వేసిన ఓట్లు ఏమవుతున్నాయో తెలీడం లేదు. మాకు, కేజ్రీవాల్, కాంగ్రెస్‌కు జరిగిందే రేపు చంద్రబాబు, నితీష్, RJDకి కూడా జరగొచ్చు” అని కామెంట్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola