
Deputy CM Pawan Kalyan Palani Temple | షష్ఠ షణ్ముఖ యాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ | ABP Desam
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ షష్ట షణ్ముఖ యాత్రలో భాగంగా తమిళనాడులోని పళని క్షేత్రాన్ని దర్శించుకున్నారు. పళనిలోని అరుల్మిగు దండాయుధపాణి స్వామివారి క్షేత్రంలో ఉచ్ఛకాల పూజలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం. ఇందుకోసం ఆలయానికి రోప్ వే మార్గంలో ప్రయాణించారు పవన్ కళ్యాణ్. పవన్ తో పాటు ఆయన కుమారుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి ఉన్నారు. పళనిలో అత్యంత ముఖ్యమైన పండుగగా పరిగణించే థాయ్-పూసం, తమిళ థాయ్ నెల పౌర్ణమి రోజున స్వామి వారి దర్శనం అదృష్టంగా భావిస్తున్నానన్నారు పవన్ కళ్యాణ్.జ్ఞానం సర్వసిరుల మూలం. విశ్వాన్ని చుట్టి వచ్చే విషయంలో తన సోదరుడు శ్రీ విఘ్నేశ్వరుడి చేతిలో ఓడి జ్ఞాన సంపన్నత కోసం ఆది దంపతుల ముద్దుల తనయుడు శ్రీ సుబ్రహ్మణ్యుడు భూమికి వచ్చారు. జ్ఞాన సముపార్జన కోసం వచ్చిన స్వామి పళని కొండపై వెలిశారు అని చెబుతారు. గొప్ప ఆధ్యాత్మిక కేంద్రమే పళని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం. దండాయుధపాణిగా, పళని స్వామిగా, మురుగన్ గా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ పిలుచుకుంటారు.