Sarada peetham Swaroopanandendra on Chandrababu | చంద్రబాబుపై స్వరూపానందేంద్ర ప్రశంసలు | ABP Desam


అమ్మవారి కృపతో మూడో సారి బిజెపి కేంద్రం లో అధికారంలోకి వచ్చిందన్నారు విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. కేదారీ హరిద్వార్ తో సహా ఉత్తర భారత దేశం అభివృద్ధి మోడీ చేశారన్న స్వరూపానందేంద్ర త్వరలో ప్రమాణ స్వీకారం చేయ బోతున్న  చంద్రబాబు..పవన్ కళ్యాణ్ లకు అమ్మవారి ఆశీర్వాదం వుంటాయన్నారు.శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామ్మోహన్ నాయుడుకు  కేంద్ర మంత్రి పదవి లభించడం సంతోషకరమని శ్రీ మహా లగ్నంలో 
11.25 గంటలకు సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అది శుభ లగ్నమని అన్నారు స్వరూపానందేంద్ర. చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నానన్న స్వరూపానందేంద్ర క్లిష్ట పరిస్థతుల్లో వున్న ఏపీని చంద్రబాబు ఆడుకుంటారనిని ఆశిస్తున్నానన్నారు.
ఏపీ రాజధానిగా తీర్చిదిద్దే అమరావతిలో మా పీఠానికి స్థలం వుంది.అక్కడ పీఠాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా  అమ్మవారి అశీస్సులు వుండాలని ఆశిస్తున్నాన్న విశాఖ శారదాపీఠం అధిపతి చంద్రబాబు..పవన్ కళ్యాణ్ హయాంలో దేవాదాయ శాఖ అభివృద్ధి చెందాలని కోరుతున్నానన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola