Nellore News: ఇసుక రీచ్ వద్ద మహిళా సర్పంచ్, గ్రామస్థుల ఆందోళన
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మనిగల్లు ఇసుక రీచ్ వద్ద సర్పంచ్ సహా గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దీంతో లారీలు, ట్రాక్టర్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. తమ ప్రాంతంలో తవ్విన ఇసుక తమ అవసరాలకు ఇవ్వకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నారంటూ నినాదాలు చేశారు. ముందుగా గ్రామంలో ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఇవ్వాలని కోరారు. 20 అడుగులకు మించి తవ్వేస్తున్నారని, భూగర్భ జలాలు అడుగంటిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రీచ్ అనుమతుల్ని ఉన్నతాధికారులు ఆపేయాలని డిమాండ్ చేశారు. అనుమతి పత్రాలు చూపాలని అడిగితే ఇసుక తవ్వేవాళ్లు తమను బెదిరిస్తున్నారని సర్పంచ్ పూజిత తెలిపారు.