Sajjala On PRC Meeting : పీఆర్సీ అమలులో ఇబ్బందులుంటే సవరిస్తాం

Continues below advertisement

కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు పడుతుంటే.. పాత జీతాలు ఎలా వేస్తామని ఉద్యోగ సంఘాలను ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. స్టీరింగ్ కమిటీ సభ్యులతో చర్చల ముగిశాక.. వారి ప్రతిపాదనలను అంశాలవారీగా పరిశీలిస్తామని తెలిపారు. ఛలో విజయవాడపై ఎలాంటి ఆంక్షలు పెట్టమని... ఉద్యోగుల కార్యక్రమాన్ని అడ్డుకోమని.. కాకపోతే కొవిడ్ నిబంధనలు మాత్రం పాటించాలని సూచించారు. ఐఆర్ అనేది తాత్కాలిక అడ్జెస్ట్‌మెంట్ మాత్రమేనని ఆయన తెలిపారు. ఉద్యోగసంఘాల నేతలను మంత్రులు బెదిరిస్తున్నారనడం అవాస్తవమన్నారు. హైకోర్టు ఆదేశాలను ఉద్యోగులు కూడా పరిగణనలోకి తీసుకుని తమ కార్యాచరణను వాయిదా వేసుకోవాలన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram