రోశయ్య ఉద్యమ స్పూర్తితో రాజకీయాలు చేసిన వ్యక్తి : శైలజానాధ్ | ABP Desam

రోశయ్య ఆకస్మిక మరణం తీవ్రంగా కలిచి వేసిందని ఏపి పిసిసి అధ్యక్షుడు శైలజానాధ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతిలోని కాంగ్రెస్ పార్టి కార్యాలయంలో రోశయ్య ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ‌ సందర్భంగా శైలజానాధ్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టి పెద్ద దిక్కును కోల్పోయిందని,రాష్ట్రం, దేశం స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తితో రాజకీయాలు చేసిన ఓ శిఖరాన్ని కోల్పోవడం చాలా భాధాకరం అన్నారు.కాంగ్రెస్ పార్టి పట్ల, కాంగ్రెస్ పార్టి సిద్దాంతాల పట్ల నిబద్ధత కలిగిన నాయకుడని, గాంధి చూపిన మార్గంలో రాజకీయం చేసిన వ్యక్తి రోశయ్య అని గుర్తు చేశారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola