Sai Dharam Tej on Egg Puffs | వైసీపీ నేతలతో ట్విట్టర్ లో తలపడుతున్న సాయి తేజ్ | ABP Desam

 సాయి ధరమ్ తేజ్. ఈ మెగా హీరోకి తన చిన్నమావయ్య పవన్ కళ్యాణ్ అంటే బోలెడంత ఇష్టం. అది సినిమాలు, ఫ్యామిలీ వరకే కాదు. పాలిటిక్స్ లోనూ చూపిస్తారు సాయి ధరమ్ తేజ్. ఇప్పుడు తన చిన్నమావను ఊరికే ట్రోల్ చేస్తున్న ఓవ్యక్తికి గట్టిగా కౌంటర్లు ఇచ్చారు సాయి ధరమ్ తేజ్. అసలు మేటర్ ఏంటంటే తణుకు అన్న క్యాంటీన్ లో ప్లేట్లను సరిగ్గా కడగటం లేదంటూ వైసీపీ సోషల్ మీడియా ఓ పోస్ట్ పెట్టింది. దానికి టీడీపీ కూడా కౌంటర్ ఇచ్చింది. చేతులు కడిగే ప్లేస్ ను చూపించి ప్లేట్లు కడిగే ప్లేస్ అంటున్నారంటూ పోస్ట్ పెట్టింది. ఇక్కడి వరకూ ఓకే. డా. ప్రదీప్ రెడ్డి చింతా అనే ఓ వైసీపీ నేత ఈ ఇష్యూ లోకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను లాగారు. మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ. అన్న క్యాంటీన్ లో ప్లేట్లు కడగొచ్చుగా ఆ సేఫ్ హ్యాండ్స్ తో అని ట్వీట్ పెట్టారు. సో రంగంలోకి సాయి ధరమ్ తేజ్ ఎంటరయ్యారు. డాక్టర్ గారు మీరెక్కడ ఉంటారండీ అని ట్వీట్ పెట్టారు. దానికి ఆ డాక్టర్ నా అడ్రస్ నా బయోలోనే ఉంది వెళ్లి చూసుకో బ్రదర్ అని పెట్టారు. డా. ప్రదీప్ రెడ్డి చింతా ప్రస్తుతం వైఎస్సార్సీపీ కి యూకేలో కన్వీనర్ గా ఉన్నారు. దీంతో సాయి ధరమ్ తేజ్ పొలిటికల్ గానే కౌంటర్ ఇచ్చారు. ఎగ్ పఫ్స్ రేట్లు ఎందుకు ఇంత పెరగటంలో ఆశ్చర్యం లేదు. మీరు కూడా బాగానే తిని ఉంటారు అనుకుంటున్నా. టేక్ కేర్ సర్ అని అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. దానికి కౌంటర్ గా ఉప్పెన సినిమాలో మీరు మైనర్ ను హీరోయిన్ గా పెట్టుకుని అడల్ట్ కంటెంట్ చేశారు అంటూ క్రృతిశెట్టిని డిస్కషన్ లోకి లాక్కొచ్చాడు ఆ డాక్టర్. దానికి సాయి ధరమ్ తేజ్ కౌంటర్ ఇవ్వలేదు కానీ పవన్ కళ్యాణ్ అండ్ మెగా ఫ్యాన్స్ అయితే గట్టిగా ఆడుకుంటున్నారు. రీజన్ ఉప్పెన సినిమాలో హీరో సాయిధరమ్ తేజ్ కాదు అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola