Sri Krishna Janmashtami 2024 | అనంతపురంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు |ABP Desam
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSri Krishna Janmashtami 2024 |
అనంతపురం జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా భక్తులు నిర్వహిస్తున్నారు. అనంతపురం నగరంలోని ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
దేశవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ మందిరాలలో శ్రీకృష్ణుని దేవాలయాలు మామూలు దేవాలయాలుగా మాత్రమే మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అనంతపురం నగరంలో ఉన్న శ్రీకృష్ణుడి దేవాలయం రథం ఆకారాన్ని పోలి ఉంటుంది.
శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడని.. దైవాంత సంభూతుడైన శ్రీకృష్ణ లీలలు అందరూ తెలుసుకునే విధంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 80 మందిరాలకు పైగా ఉన్నాయని ఇస్కాన్ మందిర కమిటీ సభ్యుడు శ్రీకృష్ణ అరామదాసు వెల్లడించారు. ఇస్కాన్ మొదటిసారిగా న్యూయార్క్ నగరంలో స్థాపించడం జరిగిందని ప్రపంచవ్యాప్తంగా వందల సంఖ్యలో శ్రీకృష్ణుని దేవాలయాలు ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందంటున్నారు.దేశంలో ఉన్న ఇస్కాన్ మందిరాలలో అన్నీ కూడా సాధారణ దేవాలయాలు లాగే ఉంటాయని... అనంతపురం నగరంలో ఉన్న దేవాలయం మాత్రం శ్రీకృష్ణుడు వ్రతం తోలుతూ ఉన్న ఆకారాన్ని పోలి ఉంటుందని వెల్లడించారు.