RS Praveen Kumar Tweet Controversy Sunil Kumar IPS | ఒక్క ట్వీట్ తో తేనె తుట్టను కదిపిన RS ప్రవీణ్

కోడి గుడ్డు మీద ఈకలు పీకొద్దు.. ఏంటిప్పుడు షడన్ గా దీని గురించి ఎందుకుమాట్లాడున్నా అనుకుంటున్నారా.. 
ఎందుకంటే నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇదొక ట్రెండింగ్. వాస్తవానికి ఇదొక సెన్సిటివ్, పర్సనల్ ఇష్యూ అని భావించి దీని గురించి ఇష్యూ చేయొద్దు అనుకున్నాను. అందుకే ఒక రోజు ఆలస్యం కూడా అయింది. అయితే దీని మీద రకరకాల వ్యాఖ్యానాలు, చర్చలు జరుగుతున్నందున డిస్కషన్ చేయక తప్పడం లేదు.  మళ్లీ కోడుగుడ్డు దగ్గరకు వద్దాం.. పాత తెలుగు నుడికారం గురించి చెప్పడం కాదు.. ఎక్కడిది ఈ మాట అంటే మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత తెలంగాణ రాజకీయ నేత, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆంధ్రా డీజీ పీవీ సునీల్ కుమార్ కుమార్ సస్పెన్షన్ విషయంలో చేసిన వ్యాఖ్యలివి. సునీల్ కుమార్ కు మద్దతుగా ఆయన మాట్లాడటం ఇదే మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా సపోర్ట్ చేశారు. ఒకప్పటి తన సీనియర్ కు మద్దతుగా ప్రవీణ్ కుమార్ మాట్లాడటం తప్పు కాదు. ఆయన పాయింట్ ఆయన చెప్పొచ్చు. అయితే... ఆర్ఎస్పీ వ్యాఖ్యలు ఇంకో చర్చకు దారితీశాయి. తీవ్ర ఆరోపణలు ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేయడం, ఐపీఎస్ సర్వీసు రూల్స్ ను అతిక్రమించినా సపోర్ట్ చేయడంతో పాటు.. పక్క రాష్ట్ర వ్యవహారాల్లో వేరే పార్టీ రాజకీయ నాయకులు జోక్యం అవసరమా అనేవరకూ వ్యాఖ్యానాలు, దళిత్ విక్టిమ్ కార్డు, కులాన్ని ఇమ్యూనిటీగా వాడుకుంటున్నారనే వరకూ వ్యాఖ్యానాలు వెళ్లాయి.  ( ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేవలం మాజీ ఐపీఎస్ కాదు.. బీఆర్ఎస్ లో ముఖ్యనేత )  జస్ట్ జరుగుతున్న విషయాన్ని అనలైజ్ చేద్దాం.. ఆయన వ్యాఖ్యలు కరెక్టో కాదో మీరే కామెంట్లో చెప్పండి 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola