Robbery In Mandadam Saibaba Temple: గునపంతో పగులగొట్టి హుండీని బయటకు తీసుకొచ్చిన దుండగులు| ABP Desam
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలోని సాయిబాబా గుడిలో హుండీ చోరీ అయింది. అర్ధరాత్రి సమయంలో బైక్ పై వచ్చిన ముగ్గురు యువకులు.... తలుపులు పగలగొట్టి, హుండీని లోపల నుంచి బయటకు తీసుకొచ్చారు. డబ్బులు తీసుకుని హుండీని ఖాళీ ప్రదేశంలో పడేసి పారిపోయారు. అర్ధరాత్రి 2 గంటల 29 నిమిషాల సమయంలో ఈ చోరీ జరిగినట్టు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.... దర్యాప్తు చేస్తున్నారు.