Robbery Attempt in Chittoor | చిత్తూర్ లో కాల్పుల కలకలం | ABP Desam

తుపాకీ కాల్పులతో చిత్తూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలోని లక్మీ థియేటర్ సమీపంలో ఉన్న పుష్ప కిట్ వరల్డ్ షాపింగ్ మాల్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి చొరబడ్డారు దొంగలు. ఓ ప్రెస్ వాహనం లో అక్కడకి చేరుకున్న ఆరుగురు దుండగులు తుపాకులతో  ఇంట్లోకి చొరబడ్డారు. మొత్తం రెండు తుపాలకులతో కాల్పులు జరిపారు. చంద్రశేఖర్ వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని చేరుకున్న జిల్లా ఎస్పీ మణికంఠ చెందోల్ బలగాలతో ఆ ఇంటిని చుట్టూ ముట్టి ఇంట్లో వారికి ఏమి కాకుండా నలుగురిని చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. వారి దెగ్గర నుండి 2 తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆరు మంది వచ్చారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మిగితా ఇద్దర్ని పట్టుకునేందుకు తిరుపతి నుండి ఆక్టోపస్ బలగాలు రంగాలోకి దిగాయి. కానీ ఆ నిందితులు కనిపించలేదు. పారిపోయినట్లు నిర్ధారించారు ఎస్పీ మణికంఠ చెందోల్. ఇంటికి పక్కనే ఉన్న బ్యాంక్ లో దొంగతనం చేయడానికి వచ్చి ఉంటారని అందరు భావించారు. కానీ ఇక్కడే పేద ట్విస్ట్ ఉంది. పుష్ప కిడ్స్‌ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో ఎస్‌ఎల్‌వీ ఫర్నీచర్ యజమాని దోపిడీ చేయంచడానికి ఈ ముఠాని ఏర్పాటు చేసారని తెలుస్తుంది. కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన దుండగులతో ఎస్‌ఎల్‌వీ ఫర్నీచర్ యజమాని ఈ పని చేసినట్లుగా తెలుసుకున్నారు పోలీసులు. అయితే ఎస్‌ఎల్‌వీ ఫర్నీచర్ యజమాని కూడా పట్టుబడిన వారిలో ఉన్నారు. ఇతనే దోపిడికి ప్లానింగ్ చేశారని తేల్చారు పోలీసులు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola