CM Revanth Reddy at Basava Tarakam: బసవతారకం ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి

Continues below advertisement

CM Revanth Reddy at Basava Tarakam: అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీపడతానన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వార్షికోత్సవానికి వచ్చిన ఆయన ఆరేళ్ల తర్వాత జరిగే 30వ వార్షికోత్సవానికి తానే ముఖ్య అతిథిగా వస్తానన్నారు.

తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్ ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 24వ వార్షికోత్సవంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో  హెల్త్ టూరిజం హబ్ గురించి ప్రకటించారు.  అన్ని రకాల వైద్య సేవలు అందేలా హెల్త్ టూరిజం హబ్ ఉంటుందన్నారు.  ఇందులో బసవతారకం ఆసుపత్రికి చోటు ఖచ్చితంగా ఉంటుందని..  
వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు.  ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా  హైదరాబాద్ కు వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందుతాయనేలా తీర్చిదిద్దుతామన్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram