Nellore:నెల్లూరు లో పల్లె వెలుగు బస్సులకు మరమ్మతులు
ఏపీఎస్ఆర్టీసీ అనగానే ముందుగా గొర్తొచ్చేది పల్లె వెగులు బస్సులే. ఎక్కువ సంఖ్యలో ఉండేవి కూడా ఆర్డినరీ సర్వీసులే. కానీ వీటి వల్ల వచ్చే ఆదాయం మాత్రం అంతంతమాత్రమే. అందుకే ఎక్స్ ప్రెస్ లు, లగ్జరీ బస్సుల మెయింటెనెన్స్ పై పెట్టిన శ్రద్ధ, పల్లె వెలుగు బస్సులపై పెట్టరు. అయితే ఇప్పుడు పల్లె వెలుగు బస్సులకి కూడా మంచిరోజులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 3వేలకు పైగా ఉన్న పల్లె వెలుగు బస్సుల్లో 2వేల బస్సులకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి, కొత్తగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు అధికారులు.