Renigunta Fire Accident : ఘోరఅగ్ని ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా వైద్యుడి మృతి | ABP Desam
రేణిగుంటలోని భగత్ సింగ్ కాలనీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. నూతనంగా నిర్మిస్తున్న కార్తికేయ హాస్పిటల్ లో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆసుపత్రిలో భారీ ఎత్తున ఫర్నిచర్స్., ఎలక్ట్రానిక్ పరికరాలు., పిఒపి డిజైన్., అట్టపెట్టెలు ఉండటంతో మంటలు మరింత వేగంగా మంటలు వ్యాప్తి చెందాయి.