కడపలో ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్ట్.. ఎన్ని దుంగలెత్తుకెళ్లారంటే?

కడప జిల్లా ఆకులనారాయణపల్లిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు ఇల్లీగల్ గా ఎర్ర చందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ KKN Anburajan చెప్పారు. అరెస్టయిన వారిలో అంతర్రాష్ట్ర స్మగ్లర్ ఉన్నాడని.. అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. నిందితుల నుంచి రెండు వాహనాలను, 20 ఎర్ర చందనపు దుంగలను స్వాధీనం చేసుకున్నామని అన్బురాజన్ చెప్పారు. ఎర్రచందలు దుంగలు రవాణా చేసే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, తరుచూ దాడులు నిర్వహిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola