Reasons For Roja Loss in Nagari | అవినీతి, నోటి దురుసు రోజా కొంప ముంచాయా? | ABP Desam

సీనియర్ కథానాయిక, నటి రోజా సెల్వమణి (Roja Selvamani) గురించి యువతరం ప్రేక్షకులకు, స్కూలుకు వెళ్లే చిన్నారులకు సైతం తెలుసంటే కారణం 'జబర్దస్త్'. నటిగా అవకాశాలు లేని ఆమెకు 'జబర్దస్త్' జడ్జి సీటు తెలుగు ప్రజల్లో గుర్తింపు తెచ్చింది. మైలేజీ ఇచ్చింది. 

నగరిలో ఎమ్మెల్యేగా, వైసీపీ నాయకురాలిగా కంటే 'జబర్దస్త్' జడ్జిగా ఆవిడకు ఎక్కువ పేరు ఉంది. అందుకే, ఏపీ ఎన్నికల్లో నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో ఘోర పరాజయం పొందిన తర్వాత 'జబర్దస్త్ పిలుస్తోంది కదలిరా' అని బండ్ల గణేష్ సెటైరికల్ ట్వీట్ వేశారు. రోజా మళ్లీ 'జబర్దస్త్'కు జడ్జి వెళితే మంచిదని కొందరు సలహాలు కూడా ఇచ్చారు. 

రోజా సెల్వమణి 'జబర్దస్త్'కు వస్తారో? రారో? ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ వస్తే తాము ఆ షో చూసే ప్రసక్తి లేదని, 'జబర్దస్త్'ను బాయ్ కాట్ చేస్తారని కొందరు ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లేటెస్ట్ 'జబర్దస్త్' ప్రోమో కింద కామెంట్స్ చూస్తే... రోజా రాకూడదని కోరుకుంటున్న ఆడియన్స్ ఎక్కువ మంది కనిపిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola