Ravi Shastri Goosebumps Speech on Rishabh Pant | Ind vs Pak మ్యాచ్ లో ఫీల్డింగ్ గోల్డ్ మెడల్ పంత్ దే
టీ20 వరల్డ్ కప్ లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఎంత థ్రిల్లింగ్ గా జరిగిందో అందరం చూశాం కదా. ఇప్పుడు ఆ మ్యాచ్ లో అద్భుతమైన ఫీల్డింగ్ చేసిన భారత ఆటగాడికి డ్రెస్సింగ్ గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపేందుకు ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ గత వన్డే వరల్డ్ కప్ నుంచి ఈ డ్రెస్సింగ్ రూమ్ గోల్డ్ మెడల్స్ ఇస్తున్నారు. అలా ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ లో వికెట్ కీపర్ రిషభ్ పంత్, బాబర్ ఆజమ్ ఇచ్చిన క్యాచ్ పట్టిన సూర్య కుమార్ యాదవ్, మరో ఫీల్డర్ తగిలినా బంతిని క్యాచ్ పట్టుకున్నా అర్ష్ దీప్ సింగ్ లను ఫీల్డింగ్ కోచ్ అప్రిషియేట్ చేశారు. కానీ ఫీల్డింగ్ గోల్డ్ మెడల్ ను అనౌన్స్ చేయటానికి మాజీ కోచ్, కామేంటేటర్ రవిశాస్త్రిని ఇన్వైట్ చేశారు. రవిశాస్త్రి పంత్ ను బెస్ట్ ఫీల్డర్ గా ప్రకటించి గోల్డ్ మెడల్ ఇచ్చారు.ఈ సందర్భంగా తనదైన స్టైల్ లో పంత్ గురించి మాట్లాడాలని టీమిండియా జట్టు సభ్యులంతా రవిశాస్త్రిని కోరారు. పంత్ గురించి కచ్చితంగా మాట్లాడాలన్న రవిశాస్త్రి..పంత్ కి యాక్సిడెంట్ జరిగిన వార్త తెలియగానే తన కంట్లో నీళ్లు తిరిగాయన్నారు. ఆసుపత్రికి వెళ్లి పంత్ ను చూసినప్పుడు ఆ బాధ మరింతగా అనుభవించానన్నాడు రవిశాస్త్రి. కానీ అలాంటి పరిస్థితి నుంచి కోలుకుని తిరిగి భారత జట్టు లో అడుగుపెట్టడం..పాకిస్థాన్ లాంటి టీమ్ మీద వరల్డ్ కప్ మ్యాచ్ ను పంత్ గెలిపించటం చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత గర్వంగా ఉందన్నాడు. రిషభ్ పంత్ లాంటోడు మృత్యువు కోరల్లో నుంచి కూడా విజయాన్ని లాక్కునే సమర్ధుడని ప్రశంసించారు రవిశాస్త్రి. పంత్ తిరిగివచ్చిన తీరు, ఆ పట్టుదల ఎన్నో లక్షల మందిలో స్ఫూర్తిని రగిలిస్తుందని తనదైన స్టైల్ లో గూస్ బంప్స్ స్పీచ్ ఇచ్చారు రవిశాస్త్రి. బీసీసీఐ ఆ వీడియోను పంత్ కి ట్రిబ్యూట్ అంటూ పోస్ట్ చేసింది.