Pawan Kalyan Oath Taking Deputy CM | పవన్ కు ఉపముఖ్యమంత్రి..జనసేనకు ఎన్ని మంత్రి పదవులంటే ? | ABP

Continues below advertisement

కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇందుకు అనుగుణంగా రేపు చంద్రబాబుతో పాటు పవన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయటం ఖాయమైంది. అయితే పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉపముఖ్యమంత్రిగా ఉండనున్నారు. ఈ మేరకు తమ డిమాండ్ ను ఇప్పటికే టీడీపీకి జనసేన అధినేత స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ డిమాండ్ వెనుక కారణాలేంటీ ఈ వీడియోలో.

Andhra Pradesh Cabinet: కేంద్ర మంత్రివర్గంలోఎవరెవరు ఉంటారనే ఉత్కంఠకు ఇప్పటికే తెరపడింది. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు ఎవరికి ఉంటుంది... జనసేనకు ఎన్ని పదవులు ఇస్తారు... బీజేపీ ఎన్ని తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది. ఈ కేబినెట్ కూర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారని మిత్రపక్షాలతో కూడా మాట్లాడినట్టు చెబుతున్నారు. ఈసారి 164 మంది గెలవడంతో పోటీ మామూలుగా లేదు. అందులో మహిళలు, సీనియర్లు, యువత ఇలా ఎటు చూసినా మంత్రివర్గంపై ఆశలు పెట్టుకున్న వాళ్లే కనిపిస్తున్నారు. అన్నింటినీ బేరీజు వేసుకొని చంద్రబాబు జాబితాను కొలిక్కి తీసుకొచ్చినట్టు చెప్పుకుంటున్నారు. 

మంత్రివర్గంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తారని టాక్. పది వరకు బీసీలకు పదవులు ఇస్తారని చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు మూడు లేదా నాలుగు, మైనార్టీలకు ఒకటి ఇచ్చే ఛాన్స్ ఉంది. మిగిలిన పదవులను కమ్మ, కాపు, రెడ్డి సహా ఇతర మేజర్ సామాజిక వర్గాలకు కేటాయిస్తారు. మళ్లి జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. ఈసారి ఉమ్మడి జిల్లాలలను ప్రాధాన్యతగా తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారని సమాచారం. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram