AP BJP President Purandeswari on Chandrababu | ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతు తెలిపిన పురంధేశ్వరి

Continues below advertisement

NDA ఎమ్మెల్యేల శాసనసభా పక్ష సమావేశంలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి చంద్రబాబును ముఖ్యమంత్రిగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు

టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి శాసనసభాపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్‌లో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి (Purandheswari), కూటమి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎన్డీయే కూటమి ఎల్పీ లీడర్‌గా చంద్రబాబు పేరును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పంపనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కూటమికి గవర్నర్ ఆహ్వానం పలకనున్నారు. బుధవారం ఉదయం 11:27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఈ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పంపనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కూటమికి గవర్నర్ ఆహ్వానం పలకనున్నారు. బుధవారం ఉదయం 11:27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram